టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలని విచారించిన అనంతరం.. జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరారిలో ఉన్న జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని గొవాలోని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆయేషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. తన భర్త జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని అన్నారు.
ఇటీవల నేషనల్ అవార్డు సాధించిన నా భర్తను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని.. ఇందులో కుట్ర దాగి ఉందని అన్నారు. అందరూ కలిసి జానీ మాస్టర్ పై కుట్ర పన్నారని.. ఇందులో బాగంగానే మహిళా కొరియోగ్రాఫర్ తో పోలీసులకు ఫిర్యాదు చేయించారని చెప్పుకొచ్చారు. అలాగే తన భర్త పై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయేషా.. ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపిస్తే..ఆయనను వదిలేసి వెళ్తానని చెప్పుకొచ్చారు. అలాగే 16 ఏళ్లకే రేప్ జరిగినట్టు చెబుతున్న ఆ యువతి వద్ద ఆధారాలున్నాయా అంటు అయోషా ప్రశ్నించింది. దీంతో పాటుగా బాధితురాలుగా చెప్పుకుంటున్న ఆ మహిళా కొరియోగ్రాఫర్‌కి చాలా మందితో సంబంధాలున్నాయని ఆరోపించింది. జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టే జానీని టార్గెట్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.