కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) పై సోమవారం ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్(Rayadurgam Police Station)లో కేసు నమోదైంది. ఈ ఆరోపణలపై స్పందించిన జనసేన(janasena) పార్టీ.. అతనిపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. జానీ మాస్టర్ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. రేపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశానికి నిర్ణయించారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ (Choreographers Association)అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమావేశం రేపటికి వాయిదా వేశారు. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్‌లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా రేపటి సమావేశం అనంతరం జానీ మాస్టర్‌పై వారు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఓటీటీలో ‘గొర్రె పురాణం’
Share this… Facebook Twitter Whatsapp Linkedin సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం…
Read more