నేడు ఏపీ సచివాలయానికి స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రానున్నారు. ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి చేరుకోనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల విజయవాడ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వీరిద్దరూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయం అందించనున్నారు. ఇటీవల వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి చెరో 50 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు తమ విరాళం ఇవ్వడానికి నేడు సచివాలయానికి రానున్నారు.
“రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. త్వరలోనే ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నా వంతు బాధ్యతగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయనిధులకు చెరో 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను” అని రామ్ చరణ్ తెలిపారు.
“వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చేయూత అందించాల్సిన సమయం ఇదే. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయనిధులకు మొత్తం కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అని రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.