తన సొంతూరు కర్ణాటకలోని కుందపురకు నన్ను తీసుకువచ్చి, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలనేది తన తల్లి చిరకాల స్వప్నం అని, అది ఇవాళ నెరవేరిందని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 2 తన తల్లి పుట్టినరోజని… జన్మదినానికి ముందు ఆమె కోరిక నెరవేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇంతకంటే గొప్ప బహుమతిని ఆమెకు తాను ఇవ్వలేనని చెప్పారు.
ఈ కల నెరవేరేందుకు తనతో పాటు ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్, సినీ నిర్మాత, హొంబలే గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగండూర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని తారక్ చెప్పారు. తన ఆప్త మిత్రుడు రిషబ్ శెట్టి (కాంతార ఫేమ్) తమతో ఉండటం ఈ సంతోష సమయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని అన్నారు. తన తల్లి, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ లతో కలిసి దిగిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.