లెటెస్ట్ మూవీ ‘క’ (Kaa). విలేజ్ (village) బ్యాక్‌డ్రాప్ (backdrop)లో డైరెక్టర్స్ సుజీత్ (Sujeet), సందీప్ (Sandeep) తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి (Diwali) స్పెషల్‌గా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ (Super Hit) సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే కలెక్షన్స్‌లో దూసుకుపోతూ.. బాక్సాఫీస్ (box office) వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మేరకు ‘క’ సినిమా ప్రజెంట్ దీపావళి విన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్ (Official) అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం.
ఈ మేరకు.. ‘దీపావళి విజేతగా #KA. సెన్సేషనల్ రన్ ఓవర్సీస్‌లో ఇంకా కొనసాగుతుంది.. భారీగా 753K+ డాలర్లు వసూలు చేసింది అలాగే ఇంకా లెక్కింపు రన్నింగ్‌లో ఉంది. పెద్ద స్క్రీన్‌లలో పురాణ #దీపావళి KA బ్లాక్‌బస్టర్‌ని మిస్ అవ్వకండి’ అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇక ఈ మూవీలో తన్వీరామ్ (Tanveeram), నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్స్‌గా నటించగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.