ప్రతి నటుడు, దర్శకుడు, నిర్మాత.. తమ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటారు. సినిమా విజయానికి చాలా కష్టపడుతుంటారు, పెట్టుబడికి రెట్టింపు వసూళ్లు రావాలని ఆశిస్తారు. సినిమా విడుదలకు ముందు చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదని చూసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా సినిమా ఫెయిల్ అవుతుంది. అయితే, లేడీ కిల్లర్ మూవీ మాత్రం సినీ పరిశ్రమలో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
45 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన లక్ష రూపాయల వసూళ్లు!
అజయ్ బెల్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ లేడీ కిల్లర్, అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 45 కోట్లుగా ఉండగా, థియేట్రికల్ రిలీజ్ ద్వారా కేవలం లక్ష రూపాయల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. జాతీయ స్థాయిలో వెయ్యి లోపు టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఇది బాలీవుడ్ చరిత్రలో ఘోరంగా ఫెయిల్ అయిన సినిమాగా నిలిచింది.
సమస్యలు, సమస్యలు..
చిత్రం నిర్మాణ దశలోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. చివరగా నవంబర్ 2023లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. మొదట రోజే కేవలం 293 టిక్కెట్లు అమ్ముడవడం, రూ. 38,000 వసూలు కావడం గమనార్హం. సినిమా మొత్తం కలెక్షన్లు లక్ష రూపాయల లోపే ముగియడం ఆశ్చర్యకరం.
OTT ఒప్పందం, అనుకోని ..
లేడీ కిల్లర్ మొదట OTT ప్లాట్‌ఫారమ్‌తో ఒప్పందం చేసుకుంది. డిజిటల్ విడుదల డిసెంబర్ చివరిలో ప్లాన్ చేశారు. కానీ, డైరెక్ట్ OTT విడుదలకు వీలులేక, 4-6 వారాల థియేట్రికల్ రిలీజ్ విండో కోసం నవంబర్ వరకు వేచి ఉండాల్సి వచ్చింది. థియేటర్లలో విడుదల చేసిన వెంటనే సినిమా డిజాస్టర్ కావడంతో, OTT ప్లాట్‌ఫారమ్ కూడా విడుదలను వెనక్కి తీసుకుంది. అందువల్ల ఇప్పటి వరకు లేడీ కిల్లర్ ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా రాలేదు.
ఘోర పరాజయం
మొత్తం మీద, 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన లేడీ కిల్లర్ సినిమా పరమ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అసంపూర్తిగా థియేటర్లలో విడుదల చేసిన కారణంగా డిజిటల్ విడుదల కూడా ఆగిపోవడంతో, ఈ చిత్రం సినీ పరిశ్రమలో మరో అపజయ కథగా నిలిచిపోయింది.