శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ చిత్రం కోసం తారక్ ఫ్యాన్స్ ఆతృతగా వేయిటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 27వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ ఫిల్మ్ నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. తారక్ మరియు జాన్వీ రొమాంటిక్ పాటలకు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ నెల (సెప్టెంబరు) 10 వ తేదీన ముంబయిలో దేవర చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న నెటిజన్లు మరో రెండ్రోజుల్లో తారక్ మరియు సూపర్ స్టార్‌ను ఒకే వేదికపై చూడబోతున్నామంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మా నాన్న సూపర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్
Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: మా నాన్న సూపర్ హీరో; నటీనటులు: సుధీర్ బాబు,…
Read more