మంచు మనోజ్, భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో, బిడ్డకు జరిగిన అన్న ప్రసన్న వేడుక కష్టనంగా మారింది. ఈ వేడుకలో మంచు లక్ష్మి తన కూతురు యాపిల్‌ను ఫంక్షన్‌కు తీసుకెళ్లి మనోజ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ క్యూట్ వీడియోను మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ ప్రత్యేకమైన రోజు తన హృదయాన్ని ప్రేమ, కృతజ్ఞతతో నింపిందని, తన కుటుంబం మరియు స్నేహితులతో జరుపుకోవడం ఎంతో గొప్ప అనుభవమని పేర్కొంది
కొత్త ప్రారంభాలు, మైలురాళ్లను గుర్తించడం, జీవిత సౌందర్యాన్ని కలిసి జరుపుకోవడం ఇదోక ప్రత్యేక అనుభూతి. యాపిల్‌ను చూడగానే మనోజ్ రియాక్షన్ వెలకట్టలేనిది (ఆమెను తీసుకొచ్చి ఆశ్చర్యపరిచాను). మేము కుటుంబం, ప్రియమైన స్నేహితులతో పంచుకునే బంధం కంటే గొప్ప బంధం లేదు. ఇలాంటి మంచి వ్యక్తులను నా పక్కన కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. ఈ అందమైన రోజు కోసం.. మనల్ని దగ్గర చేసే విమానాలు, కార్లు అలాగే వర్షం ఉన్నప్పటికీ ఈ యాత్రను చాలా ఆహ్లాదకరంగా చేసినందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గణేశుడు నా చిన్న మేనకోడలు దేవసేనను ఎల్లప్పుడూ కాపాడుతాడు, ఆమెను అడుగడుగునా రక్షిస్తాడు. ప్రేమ, సంరక్షణ, వెచ్చదనంతో నిండిన ఇలాంటి క్షణాల కోసం జీవించే ఒక అత్తగా నా హృదయం నిండి ఉంది’ అంటూ పోస్ట్‌లో పెట్టింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.