మేఘా ఆకాశ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ సాయివిష్ణు అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్ అంటూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చెన్నైలో జరిగిన మేఘా ఆకాష్, సాయివిష్ణు వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
కాగా.. నితిన్ ‘లై’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది మేఘా ఆకాశ్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో ‘లై’తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది. కోలీవుడ్‌లో 2019లో పెట్టా మూవీతో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. ఎన్నై నోకి పాయుమ్ తోట, వంద రాజావ తాన్ వరవానే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా సబానాయగన్, వడకుపట్టి రామసామి సినిమాలతో మెప్పించింది.