నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కూతురు గాయత్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి ధైర్యం చెబుతూ గాయత్రికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్యామిలీతో రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తోంది. అయితే ఇందులో ఎడమ చేతికి ఫ్యాక్చర్ కావడంతో బ్యాండేజ్ వేసుకుని కనిపించారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కాగా, ప్రజెంట్ చిరు ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.