హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) లేటెస్ట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇందులో తన్వీరామ్, నయన్ సారిక(Nayan Sarika) హీరోయిన్స్‌గా నటించగా.. సుజీత్(Sujeet), సందీప్ దర్శకత్వం వహించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Sri Chakras Entertainments) బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి(Gopalakrishna Reddy) భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి(Vamsi Nandipati) రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ పలు రికార్డులు సాధిస్తోంది.
ఈ క్రమంలో.. తాజాగా, దీపావళి విన్నర్‌గా నిలిచిన ‘క’ మూవీని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చిత్రబృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా(Social Media) ద్వారా తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘బాస్ నుంచి ప్రశంసలు. దాదాపు గంటపాటు మా కోసం సమయాన్ని కేటాయించి.. ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నందుకు థాంక్యూ. ఈ భేటీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చాడు.