మాస్ రాజా వీర లెవల్‌లో కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటే, “మిస్టర్ బచ్చన్” సినిమాతో అతిపెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు లేకపోయినా, “మిరపకాయ్” కాంబినేషన్ కావడం వలన కొంత ఆసక్తి నెలకొంది.
టీజర్, ట్రైలర్‌లు కూడా కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. పైగా, లాంగ్ హాలిడేస్ రాకతో కొంత పాజిటివ్ టాక్ వచ్చినా, రవన్నకి తిరుగులేని కంబ్యాక్ అవుతుందని అందరూ భావించారు. ఆ నమ్మకంతో మేకర్స్ ప్రీమియర్లు కూడా పెట్టారు. కానీ థియేటర్లకు హోప్స్‌తో వచ్చిన ఆడియెన్స్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్ పెద్ద షాక్ ఇచ్చాడు.
సినిమా చూసిన వారిలో ఒక్కరు కూడా పాజిటివ్‌గా స్పందించలేదు, అంటే సినిమా ఎంతగా డిజప్పాయింట్ చేసిందో చెప్పనవసరం లేదు. “మిస్టర్ బచ్చన్” రవితేజ, హరీష్ శంకర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
ఇది బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన “రైడ్” సినిమా రీమేక్. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసినప్పుడు డిజాస్టర్‌గా మారింది. సినిమా కొన్ని కీలక సన్నివేశాల్లో మార్పులు చేయడంతోనే ఈ ఫలితం వచ్చిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.31 కోట్ల బిజినెస్ చేసుకుంది. కానీ, ఇప్పటివరకు కేవలం రూ.8 కోట్ల షేర్ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది, అంటే దాదాపు రూ.24 కోట్ల నష్టం జరిగింది. ప్రస్తుతం కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ సినిమా రన్ అవుతోంది.
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకొని, సెప్టెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.