అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఇందులో సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కాబోతున్నట్లు టాక్. సంక్రాంతి కానుకగా తండేల్ థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నాగచైతన్యకు సినిమాలతో పాటు రేసింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆయన గత కొద్ది కాలంగా రేసింగ్ జోలికి పోవడం లేదు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య రేసుకు వెళ్లకపోవడానికి కారణాలు వెల్లడించారు. ‘‘నాకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే ఇష్టం ఉండేది. అయితే కొత్తరకం బైక్ ఏది కనిపించినా నేను వెంటనే డ్రైవ్ చేసేవాడిని. సినిమాల్లోకి రాకముందు ఓ స్పోర్ట్స్ కారు తెప్పించాను. ఎప్పుడు కాలీ సమయం దొరికినా ఆ కారుపై షికార్లు కొడుతూ ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక బిజీగా మారిన తర్వాత మెల్లగా ఆ అలవాటు తగ్గించుకోవాలనుకున్నాను. ఎందుకంటే.. రేసు కారు ఎంతటి స్పీడుతో వెళ్లాల్సి వస్తుందో అందరికీ తెలిసిన విషయమే.
అంత వేగంతో ట్రావెల్ చేయడం మంచిది కాదని నా స్నేహితులు చెప్పడంతో దూరంగా ఉంటున్నా. అలాగే నాపై ఇంత మంది నిర్మాతలు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీస్తున్నారు కాబట్టి నేను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా షూటింగ్‌లకు అంతరాయం జరుగుతుంది. అంతేకాకుండా అది నా వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. నాకు ఏదైనా జరిగి షూటింగ్‌లో పాల్గొనకపోతే నిర్మాతలకు కూడా నష్టం వాటిల్లుతుంది. అందుకే కారు రేస్ అనే ఆలోచన ఇప్పుడు నాలో రావడం లేదు. అప్పుడప్పుడు రేసు కారులో ట్రావెల్ చేసినా చాలా జాగ్రత్తగా లిమిట్ స్పీడ్‌తో చేయాలని నిర్ణయించుకున్నా’’ అని చెప్పుకొచ్చారు.