ఆమె ఎప్పుడూ అలాగే చేస్తుంది- హీరోయిన్‌‌పై నాగార్జున కామెంట్స్

నాగార్జున గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. 60’S లో కూడా నవమన్మధుడులా అమ్మాయిల మనస్సు దోచేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్‌గా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగ చైతన్య, నాగార్జున పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం కేసు వేశాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలో గతంలో నాగార్జున ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద కొన్నేళ్ల క్రితం ‘జయప్రదం’ పేరుతో స్టార్స్‌ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అక్కినేని నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ షోలో పాల్గొన్న నాగార్జునను.. అలనాటి హీరోయిన్ జయప్రద కొందరి హీరోయిన్లు పేరు చెప్పి వారి గురించి అడిగింది. ఈ క్రమంలోనే మీతో పనిచేసిన హీరోయిన్లలో లేజీ ఎవరని ప్రశ్నించగా.. దానికి శ్రీయా అని నాగ్ ఆన్సర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా లేజీగా ఉంటుందని, షూటింగ్‌లకు లేట్‌గా వస్తుండటంతో తాను కూడా ఇబ్బందిపడినట్లు కింగ్ తెలిపారు. తానే పక్కన కూర్చోబెట్టుకుని సెట్‌లోనే చాలా సార్లు క్లాస్ పీకానని నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం నాగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

See also  కొరటాల శివకి మరో ఆచార్య అవుతుందా?

Related Posts

మహేష్, నాగ్, రామ్ చరణ్ పార్టీ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

Share this… Facebook Twitter Whatsapp Linkedin స్టార్ హీరోస్ అందరూ ఒకేచోట కలవడం…

Read more

మీరు ఒక రేర్ డైమండ్.. ఆ స్టార్ హీరోపై శృతిహాసన్

Share this… Facebook Twitter Whatsapp Linkedin కమల్ హాసన్ (Kamal Haasan) 70వ…

Read more

You Missed

మహేష్, నాగ్, రామ్ చరణ్ పార్టీ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

  • November 7, 2024
మహేష్, నాగ్, రామ్ చరణ్ పార్టీ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

మీరు ఒక రేర్ డైమండ్.. ఆ స్టార్ హీరోపై శృతిహాసన్

  • November 7, 2024
మీరు ఒక రేర్ డైమండ్.. ఆ స్టార్ హీరోపై శృతిహాసన్

 రెచ్చిపోయిన సమంత.. ఆ హీరోతో కలిసి

  • November 6, 2024
 రెచ్చిపోయిన సమంత.. ఆ హీరోతో కలిసి

ఓటీటీలో ‘దేవర’ 

  • November 3, 2024
ఓటీటీలో ‘దేవర’ 

హైదరాబాద్ లో రష్మిక సల్మాన్‌ ఖాన్‌

  • November 3, 2024

 సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో

  • November 3, 2024
 సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో
Available for Amazon Prime