నందమూరి బాలకృష్ణ (Balakrishna) కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేశారు. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్ లో తన మొదటి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇవాళ శుక్రవారం సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని తెలుపుతూ ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ ట్విట్టర్ X లో పోస్ట్ పెట్టారు .. “నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజను ప్రత్యేక హక్కుతో పరిచయం చేయడం గొప్ప ఆనందాన్ని ఇస్తోంది..జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ..అందరి నమ్మకానికి, ఆశీస్సులకు నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో..మోక్షజ్ఞ క్యూట్ లుక్లో సింపుల్ గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్నాడు. మోక్షు ఫస్ట్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఓటీటీలో ‘గొర్రె పురాణం’
Share this… Facebook Twitter Whatsapp Linkedin సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం…
Read more