టాలీవుడ్ ప్రేక్షకులను ఇలాగే మరిన్ని రికార్డులతో అలరించాలనే ఆకాంక్షతో, 50ఏళ్ల సినీ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న అన్‌స్టాపబుల్ హీరో నందమూరి బాలకృష్ణ కు మా శుభాకాంక్షలు!
టాలీవుడ్ సీనియర్ హీరోలలో నిరవధికంగా 50 సంవత్సరాలుగా సినిమాలు విడుదల చేసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ.
ఆదిత్య 369 సినిమాతో టైమ్ ట్రావెల్ కాన్సెప్టును ఇండియన్ తెరకు పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో బాలయ్య.
నిప్పురవ్వ మరియు బంగారు బుల్లోడు రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదలై రెండు సినిమాలూ 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించాయి.
సమరసింహా రెడ్డి చిత్రంతో తెలుగులో ఫ్యాక్షన్ కథలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన బాలకృష్ణ.
నారీ నారీ నడుమ మురారి సినిమా ఒక్క ఫైట్ సీన్ లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసి 100 రోజులు థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడింది.
సాంఘికం, జానపదం, పౌరాణికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ వంటి అన్ని జానర్లలో నటించి సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక స్టార్ హీరో బాలయ్య.
బాలకృష్ణ నటించిన మొత్తం 108 సినిమాలలో 71 సినిమాలు 100 రోజులకు పైగా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడాయి.
బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమా 1000కి పైగా రోజులు ప్రదర్శించబడింది, ఇది సౌత్ ఇండియాలో మరే హీరో సాధించలేని రికార్డు.
ఇటీవల కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ 100 రోజుల విజయాలు సాధించిన హీరో బాలయ్య.
సినిమా హీరో, ఎమ్మెల్యే, హాస్పిటల్ ఛైర్మన్ గా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.
ఒకే ఏడాదిలో (1987) 8 సినిమాలు విడుదల చేసి 8 సూపర్ హిట్స్ అందుకున్న ఘనత ఒక్క బాలయ్యకే సొంతం.