తమిళ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రొమాంటిక్ లవ్ స్టోరీలతో స్టైలిష్ హీరోగా శింబు గుర్తింపు తెచ్చుకున్నాడు. మన్మధ, వల్లభ లాంటి తెలుగు చిత్రాల్లో నటించి తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత శింబు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడేళ్ల క్రితం వచ్చిన ‘మానాడు’ చిత్రంతో ఆయన మరోసారి బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టాడు. ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే.. అప్పట్లో నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన శింబు ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ బ్రేకప్ అయింది. ఆ తర్వాత హన్సికను ప్రేమించాడు. అది కూడా అంతే.. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రస్తుతం శింబు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే.. 41 సంవత్సరాల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన శింబు, హీరోయిన్ నిధి అగర్వాల్ కలిసి నటించిన మూవీ ఈశ్వరన్. ఇక ఈ సినిమా టైంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్టూ, డేటింగ్ కూడా చేస్తున్నట్లు పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, దీనికి ఇరువైపులా కుటుంబ సభ్యులు అంగీకరించారని, పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా పరోక్షంగా శింబు తండ్రి రాజేందర్ కొన్నాళ్ల క్రితమే తన కొడుకు ప్రేమ వివాహమే చేసుకుంటాడని ప్రకటించిన సంగతి తెలిసిందే.