తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం వంటి ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విపత్తు సమయంలో చాలా మంది ప్రజలకు ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ సహాయం అందించబడుతున్నప్పటికీ, పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ వంతుగా సహాయం చేశారు.
ఈ క్రమంలో మెగాస్టార్ కూతురు నిహారిక కొణిదెల కూడా విరాళం అందజేసింది. ఆమె సోషల్ మీడియాలో ప్రకటిస్తూ, “విజయవాడలోని గ్రామాలు నీట మునగడం, ప్రజలు ఇబ్బందులు పడుతుండటం నన్ను చాలా బాధపెట్టింది. నేను పుట్టి పెరిగింది నగరంలో అయినా మా కుటుంబం గ్రామాల నుండి వచ్చిన ప్రజలు. వారికి అందరికి నా హృదయపూర్వక ప్రేమ ఉంది. మా బాబాయ్ పవన్ కళ్యాణ్ సహా మా కుటుంబం సాయం చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది.
నేను కూడా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేల రూపాయలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను” అని ప్రకటించింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతున్న సమయంలో నిహారికను ట్రోల్ చేస్తున్నారు.
అలాగే కొంతమంది మీరు ఉంటున్న రాష్ట్రం సంగతే ఏం కావాలి? తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి. ఇదేం అన్యాయం చేసింది? ఇక్కడ ఉంటూ ఇలా మాట్లాడటం తప్పు అని కామెంట్లు పెడుతున్నారు.