‘అందాల రాక్షసి’(Andala Rakshasi) సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిని చేసుకుంటూ దూసుకుపోయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)తో ప్రేమలో పడింది. కొంత కాలం ప్రేమించుకున్న వీరు.. గతేడాది పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత లావణ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడు ట్రిప్స్ వేస్తూ వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. ఇక వరుణ్ తేజ్ ‘మట్కా’(Matka) మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా చాట్‌లో మెగా డాటర్‌ను.. లావణ్య సంగతులు చెప్పాలని అభిమానులు కోరగా.. నిహారిక(Niharika) తన వదిన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. లావణ్య 24 గంటలు ఇంట్లోనే ఉంటుంది. ఏదైనా పని ఉంటే తప్పితే బయటకు రాదు. నేనైతే ఇంట్లో ఒక గంట కూడా ఉండలేను. పిచ్చి లేస్తుంది. మా వదిన లావణ్య ఇంటికే ఎలా పరిమితం అవుతుందో నాకైతే అర్థం కాదు. అలాగే మా ఇంట్లో వంట చేసే బాధ్యత కూడా లావణ్యదే. అలా ప్రతిరోజూ మా వదిన కుటుంబ సభ్యుల కోసం రుచికరమైన భోజనం తయారు చేస్తుంది అని నిహారిక లావణ్య గురించి చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు విన్న నెటిజన్స్.. లావణ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.