టాలీవుడ్ హీరో నితిన్, ఆయన భార్య షాలిని తల్లిదండ్రులుగా మారారు. షాలిని మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకర విషయాన్ని నితిన్ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “మా కుటుంబంలో కొత్త స్టార్‌కు స్వాగతం” అంటూ బిడ్డ ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా నితిన్‌కు సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు వెంకీ అట్లూరి సహా పలువురు ప్రముఖులు నితిన్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. నితిన్, షాలినిల వివాహం 2020లో, కరోనా సంక్షోభం కొనసాగుతున్న సమయంలో జరిగిన సంగతి తెలిసిందే.
మా నాన్న సూపర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్టైనర్
Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: మా నాన్న సూపర్ హీరో; నటీనటులు: సుధీర్ బాబు,…
Read more