రాజకీయాల(Politics)పై హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) సంచలన ప్రకటన చేశారు. తన తొలి ఆప్షన్ సినిమా(Cinema)లకేనని, రాజకీయాలకు కాదని ఆయన స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులోనే తాను తొలి సినిమా చేశానని తెలిపారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన సినిమాలకు లక్షలాది మంది ప్రేక్షకులు, అభిమానులు టికెట్లు కొంటున్నారని చెప్పారు. ఇంతమందిని కలుస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్న వేళ ఓ సినిమా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాలపైనే తాను దృష్టిపెట్టానని పలు సినిమా కార్యక్రమాల్లో ఆయన స్పష్టం చేశారు. కానీ 2019 ఎన్నికల్లో ఏపీ(Ap)లో టీడీపీ ఓటమి పాలుకావడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు. టీడీపీ(Tdp) అధినేత చంద్రబాబు సభల్లోనూ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి(Cm Chandrababu) అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని మాటను బయటకు చెప్పారు.