‘దేవర’(Devara) సినిమాతో హిట్ అందుకున్న ఎన్టీఆర్(NTR).. ప్రజెంట్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’(War-2) తో బిజీగా ఉన్నాడు. అయాన్ ముఖేర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. తెలుగులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కాంబోలో ఓ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ‘NTRNEEL’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అలాగే 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే.. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. అయితే.. ఎన్టీఆర్ మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి రానున్నాడు. ఎందుకంటే.. ప్రజెంట్ ‘వార్ 2’ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. 2025 జనవరికి ఆ చిత్రానికి సంబంధించిన షూట్ పూర్తి చేసుకోనున్నాడు. అనంతరం ‘NTRNEEL’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. కాగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘NTRNEEL’కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు చిత్ర బృందం.