ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ట్రైలర్ మంగళవారం విడుదలై, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన అందుకుంటోంది. ఈ ట్రైలర్‌లోని విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు, ముఖ్యంగా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ట్రైలర్ విడుదలతో దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిధులుగా ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, దేవర సినిమాలో చివరి నలభై నిమిషాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆయా యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, వాటిని చూడటానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. కొరటాల శివ ఆ సీన్స్‌ను ఓ రేంజ్‌లో తీశారని ఎన్టీఆర్ తెలిపారు. ప్రత్యేకంగా, “షార్క్ షాట్” కోసం 24 గంటల పాటు చాలా కష్టపడ్డామని వివరించారు.
ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పడంతో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.