ఎన్టీఆర్ యొక్క బ్రాండెడ్ మరియు ఖరీదైన యాక్సెసరీలు: ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ప్రత్యేకతలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అతనితో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు క్యూలో నిలబడతారు. కోట్లల్లో అతని పారితోషికం ఉంటుంది. అందుకు తగినట్టుగానే అతని లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. విలాసవంతమైన ఇల్లు, గెస్ట్ హౌస్ లు, ఖరీదైన కార్లు.. ఇవన్నీ ఎన్టీఆర్ సొంతం ఎన్టీఆర్ చాలా సార్లు కూల్, సింపుల్ “నెక్ట్స్-డోర్ బాయ్” లుక్‌లో కనిపిస్తాడు, కానీ ఆయన దుస్తులు మరియు యాక్సెసరీల ధర మాత్రం సింపుల్‌గా ఉండదు :). స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ లాంచ్‌లో ఆయన వేసిన బ్రాండెడ్ ఫ్యాషన్ సెన్స్‌పై అందరి దృష్టి పడింది.
దేవర ట్రైలర్ లాంచ్: స్టైల్ అండ్ ఫ్యాషన్
‘దేవర’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా, ముంబైలో ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ SSENSE బ్రాండ్‌కు చెందినది. ఈ బ్లేజర్‌లో చేతుల వద్ద ప్రత్యేక డిజైన్ ఉండగా, దీని ధర సుమారు ₹46,000. ఈ బ్లేజర్ లోపల అమిరి బ్రాండుకు చెందిన బ్లాక్ రౌండ్-నెక్ టీ-షర్ట్ ధరించాడు, దీని ధర సుమారు ₹50,000.
ఎన్టీఆర్ అభిమానులకు మరో ఆసక్తికరమైన విషయం ఆయన ధరించిన షూస్. బాలెన్సియాగా లగ్జరీ బ్రాండ్‌కు చెందిన ఈ షూస్ సుమారు ₹1 లక్ష ధర ఉంటుంది. గత కొంతకాలంగా ఈ బ్రాండ్‌కు చెందిన షూస్ ధరించడంలో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అభిరుచి ఉంది.
లగ్జరీ వాచ్ మరియు ఇతర యాక్సెసరీలు
ఎన్టీఆర్ సాధారణంగా ధరించే లగ్జరీ వాచ్ ఆడెమార్స్ పిగ్వెట్ బ్రాండుకు చెందినది, దీని విలువ ₹1 కోటి వరకు ఉంటుంది. ఈ వాచ్ ఎన్టీఆర్ లుక్కుకు అదనపు ఆకర్షణను తెస్తుంది.
దేవర సినిమాపై అభిమానుల అంచనాలు
‘దేవర’ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అన్ని బాగా రెస్పాన్స్ పొందాయి.
దేవర: భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రం
‘దేవర’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చేసిన శ్రమ, ఆయన నటన, స్టైలిష్ లుక్స్ అభిమానులకు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
‘దేవర’ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుందని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.