పూనమ్ కౌర్: తెలుగు ప్రేక్షకులకు అందాల ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే వివాదాల వల్లే ఆమె ఎక్కువ పేరు తెచ్చుకుంది.
మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్, తన మొదటి సినిమాతోనే తన కలువ రేకులాంటి కళ్ళు, పొడవైన జుట్టు, పాలనురగలాంటి ఛాయతో తెలుగు కుర్రకారును ఫిదా చేసింది.
అయితే మాయాజాలం తర్వాత ఆమె చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. హీరోయిన్ గానే కాక, హీరోకి చెల్లిగా, ఫ్రెండ్‌గా కూడా నటించి మెప్పించింది.
సినిమాల విషయాన్ని పక్కన పెడితే, పూనమ్ కౌర్ వివాదాల ద్వారా మరింత ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తనను మోసం చేసారని ఆమె ఆరోపణలు చేస్తూనే ఉంది.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్రకు ముందు పూనమ్ కౌర్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల పూనమ్‌ని పక్కన పెట్టి పార్వతిని తీసుకున్నారట.
ఆ సమయంలో పవన్‌తో మాట్లాడనివ్వకుండా త్రివిక్రమ్ పూనమ్‌ని పక్కన పెట్టాడని, దానివల్ల ఆమె కెరీర్ నాశనం అయిందని టాక్ ఉంది. అప్పటి నుంచి పూనమ్ చేసిన ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు.
కొన్నేళ్లుగా పూనమ్ సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ, గురూజీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టులు చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.
ఇటీవల పూనమ్ తన తాజా ఫోటోషూట్‌తో అభిమానులను ఆకట్టుకుంది. వైట్ చీరలో మలయాళ ముద్దుగుమ్మలా రెడీ అయ్యి కనువిందు చేసింది. ఓనమ్ పండుగ సందర్భంగా మలయాళీ అందాలు ఎలా ఉంటాయో, అలాంటి స్టైల్లో పూనమ్ మాయ చేసింది.
స్లీవ్ లెస్ బ్లౌజ్, ముక్కుకు ముక్కుపుడక, నుదిటిపై విభూతి పెట్టుకొని పూనమ్ ఎంతో అందంగా.. కాదు కాదు, మాటల్లో వర్ణించలేని సొగసుతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు, “ఎలారా.. ఇంత అందాన్ని పక్కన పెట్టాడు గురూజీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.