ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘రాజాసాబ్’ (Rajasaab) ఒకటి. రొమాంటిక్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) నిర్మిస్తుండగా.. మారుతీ (Maruti) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఫ్యాన్ ఇండియన్ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఇప్పుడు అభిమానులను మరింత ఎగ్జైట్ చేసే విధంగా ‘రాజాసాబ్’ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం.
ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు ‘ఆ కటౌట్‌కి…. తగ్గా సరైన మీటర్ #TheRajaSaab.. అతను అక్టోబర్ 23న వస్తున్నాడు’ అంటూ పోస్టర్ (poster) రిలీజ్ చేశారు. ఇందులో సరికొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు ప్రభాస్.