ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళం ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలకు ఉపయోగపడనుంది.
ఇదే సమయంలో, అక్కినేని నాగార్జున కూడా ముందుకొచ్చి, తన కుటుంబం తరఫున ఉభయ తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. ప్రతి రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు ఈ సహాయం అందించనున్నారు. నాగార్జున మాట్లాడుతూ, “బాధిత ప్రజలకు సత్వర సాయం అందాలని, వారు త్వరగా కోలుకోవాలని” ఆకాంక్షించారు.