ఇటీవలే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గుండె పోటుతో ఆయన కుమార్తె గాయత్రి గత శనివారం కన్ను మూశారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇప్పటికే మెగస్టార్ చిరంజీవితో పాటు, దర్శకుడు త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వెంకటేశ్, నటుడు అజయ్, శివాజీ రాజా, సాయికుమార్, నాగ్‌అశ్విన్, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా తదితరులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
తాజాగా కూతురు పోయిన బాధలో ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ను పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లి ఇందు విల్లాస్‌లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి ఆయనతో మాట్లాడారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి చిత్రపటం దగ్గర నివాళులు అర్పించి, అనంతరం రాజేంద్ర ప్రసాద్‌కు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
కాగా, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి(38 ఏళ్లు) గుండెపోటుతో కన్నుమూశారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటి గంటకు ఆమె మరణించారు. రాజేంద్ర ప్రసాద్‌కు కుమార్తెతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.