ప్రభాస్ తన తాజా సినిమా ‘కల్కి 2898ఏడీ’తో బాక్సాఫీస్‌ను శాసించి, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మరో భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నాడు. ‘స్పిరిట్’ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది.
ఈ లోపు, ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టులను పూర్తిచేసుకోనున్నారు. పాన్ ఆసియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి నిరవధికంగా ఏడాది పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. 2026 జనవరిలో సినిమాను విడుదల చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని, త్రిష కథానాయికగా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ కోసం గట్టి ప్రణాళికలతో ఉన్నారని చెప్పవచ్చు.