సిజ్లింగ్ బ్యూటీ ప్రజ్నా నయన్ తాజాగా చేసిన ఆసక్తికర కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. జార్ఖండ్ కు చెందిన ఈ నటి 2022లో సురాపానం, సమరం, ఇన్ సెక్యూర్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో మోడలింగ్ చేసి, ఇప్పుడీ సారి మరింత హాట్‌గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ యువతను ఎట్రాక్ట్ చేస్తోంది.
“మీ హృదయాన్ని మండించుకోవడానికి సిద్ధంగా ఉండండి” అంటూ కాప్షన్ పెట్టిన ఈ ఫోటోలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పిలానీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు పొందిన ప్రజ్నా, ఐటీలో పని చేసి, తర్వాత మోడలింగ్ లోకి మారింది. 2018లో కన్నడ చిత్రం ఎస్కేప్ తో అరంగేట్రం చేసిన ఆమె, ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించింది. తాజాగా తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.