తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యితో పాటు జంతువుల కొవ్వు తో చేసిన ఆయిల్ కలిపి.. తిరుమల లడ్డూను అపవిత్ర చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఇష్యూపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గత ప్రభుత్వం మంటగలిపిందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. మొదట పవన్ కల్యాణ్ లడ్డు వ్యవహారంపై స్పందించడాన్ని తప్పుబట్టిన ప్రకాష్ రాజ్ తాజాగా.. టార్గెట్ డిప్యూటీ సీఎం పవన్ టార్గెట్ గా మరో ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో” జస్ట్ ఆస్కింగ్ అంటూ రాసుకొచ్చారు. కాగా బుధవారం హీరో కార్తీ తాను చేసిన లడ్డూ వ్యాఖ్యలపై సారీ చేప్పడంతో.. పవన్ కల్యాణ్ ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేయడంతో ఆయనపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?
Share this… Facebook Twitter Whatsapp Linkedin ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో…
Read more