Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 కోసం అభిమానులే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీక్వెల్ గా పుష్ప 2 ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. గత నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్ని మంచిగా జరిగి ఉంటే.. ఈ ఏడాది ఆగస్టు 15 కే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ, తాను ఒకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తెలుస్తుంది అన్నట్లు.. చివరి నిమిషంలో పుష్ప 2 వాయిదా పడింది.
పుష్ప హిట్ తో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన బన్నీకి.. అంతకు మించి హిట్ ను ఇవ్వాలని ఈ సినిమాను సుకుమార్ శిలను చెక్కినట్లు చెక్కుతున్నాడు. ఇక ఈలోపు.. కొన్ని విభేదాలు రావడంతో సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. సినిమా, షూటింగ్ అంతా పక్కన పెడితే.. అసలు పుష్ప 2 రిలీజ్ డేట్ పై ఎప్పటికప్పుడు అభిమానుల్లో గందరగోళం అవుతూనే ఉంది. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 కు పుష్ప 2 ను వాయిదా వేసిన విషయం తెల్సిందే.
క్రిస్టమస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నారు. కానీ, గత కొన్ని రోజులుగా పుష్ప 2.. క్రిస్టమస్ రేస్ నుంచి తప్పుకొని సంక్రాంతి రేస్ లోకి వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా పుష్ప 2 షూటింగ్ పూర్తికాలేదని, అందుకే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలను మేకర్స్ కొట్టిపారేశారు.
తాజాగా పుష్ప 2 నుంచి ఒక అప్డేట్ ఇస్తూ.. చెప్పిన డేట్ కే పుష్ప వస్తున్నాడు అని కన్ఫర్మ్ చేశారు. “పుష్ప 2 ఫస్ట్ హాఫ్ లాక్డ్.. లోడెడ్ విత్ ఫైర్” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ పూర్తిచేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఇంకా పుష్ప 2 క్లైమాక్స్ ను పూర్తిచేసే పనిలో ఉన్నాడట సుకుమార్.
అయితే ఇప్పుడు కేవలం డేట్ ను కన్ఫర్మ్ చేయడానికి, సోషల్ మీడియాలో పుష్ప 2 వాయిదా అన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి మాత్రమేవ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా పుష్ప 2.. డిసెంబర్ 6 నే రిలీజ్ కానుందని మరోసారి మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో బన్నీ- సుకుమార్.. పుష్ప మ్యాజిక్ ను రీపీట్ చేస్తారా.. ? లేదా.. ? అనేది చూడాలి.