అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. పుష్ప ది రైజ్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మొదటి భాగం తెలుగు సహా సౌత్ మరియు నార్త్ భారతదేశంలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.
సినిమా మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో, సుకుమార్ పుష్ప 2 ని మరింత జాగ్రత్తగా, అత్యుత్తమ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే పలు సంచలన రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
తాజా సమాచారం ప్రకారం, పుష్ప 2 ఓటీటీ హక్కులు సుమారు 275 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ హక్కులు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఉంటాయి. అలాగే, హిందీ వర్షన్ హక్కులను అనిల్ తడాని 200 కోట్ల రూపాయల అడ్వాన్స్ బేసిస్ మీద కొనుగోలు చేశాడు. ఇది కూడా ఇప్పటి వరకు ఒక సౌత్ సినిమాకు నార్త్ ఇండియాలో వచ్చిన అత్యధిక రేట్ అని చెబుతున్నారు.
మ్యూజిక్ హక్కులను కూడా టి సిరీస్ సంస్థ 60 కోట్ల రూపాయలకు దక్కించుకుంది, ఇది కూడా ఒక రికార్డుగా నిలిచింది. మొత్తం చూసుకుంటే, థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి పుష్ప 2 సినిమా ఇప్పటికే 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికం అని తెలుస్తోంది.
పుష్ప 2 సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అల్లు అర్జున్ మరియు ఫహాద్ ఫాజిల్ మధ్య సెప్టెంబర్ 3 నుంచి షూట్ చేయనున్నట్లు సమాచారం. వాయిదా ప్రచారాలను కొట్టిపారేస్తూ, చిత్ర బృందం ఈ సినిమాను డిసెంబర్ 6న 13 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు, సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.