హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే ఆయన దర్శకుడు బుచ్చిబాబుతో ‘RC16’ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరగడంతో పాటు ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. దీనిని పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో.. రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్లాడంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ దీనిపై మేకర్స్, చరణ్ రియాక్ట్ కాలేరు. తాజాగా, రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫొటో షేర్ చేస్తూ RC16పై అంచనాలను రెట్టింపు చేశారు. బ్లాక్ కలర్ టీ షర్ట్, షార్ట్ ధరించిన ఆయన ఫిట్నెస్ కోచ్ శివోహం వద్దకు వెళ్తున్నట్లు ఉన్న పిక్ షేర్ చేశారు. అంతేకాకుండా ఈ పోస్ట్‌కు ‘‘బీస్ట్ మోడ్ ఆన్ ఫైర్. ‘RC16’ లోడింగ్ శివోహం’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది.
Ram Charan is currently working on Game Changer under the direction of Shankar. Even before the release of this film, an official announcement has been made that he is teaming up with director Buchi Babu for RC16. The pooja ceremony for the film has already been conducted, and Janhvi Kapoor has been selected as the female lead. Reports suggest that the movie will be set against a sports backdrop, and this news has gone viral.
Meanwhile, rumors have surfaced that Ram Charan has flown to Australia. However, neither the makers nor Charan have responded to these speculations. Recently, Ram Charan took to Twitter to share a photo, doubling the excitement around RC16. In the photo, he’s seen in a black T-shirt and shorts, heading to his fitness coach Shivoham. He captioned the post with, “Beast mode on fire. RC16 loading. Shivoham.” This has further piqued the interest of mega fans about the film.