మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించాడు. లక్ష్మణ్ కార్య ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామా 2023 ఆగస్ట్ 23న థియేటర్లలో విడుదలై, మంచి స్పందన అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సానుకూలమైన వసూళ్లు సాధించింది.
ఇప్పుడు, ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఆహా వీడియో ఈ మూవీని సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. “మారుతీనగర్ సుబ్రహ్మణ్యం” ఒక మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపింది.
మారుతీనగర్ సుబ్రమణ్యం ఎలా ఉందంటే?
మారుతి నగర్ సుబ్రమణ్యం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ మూవీ. ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు వరకు ఆడియెన్స్‌ను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ మూవీని తెరకెక్కించాడు. అందుకు తగ్గట్లే రావు రమేష్, అంకిత్ కొయ్యతో పాటు ప్రతి క్యారెక్టర్ నుంచి ఫన్ జనరేట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్.
కథ కంటే కామెడీపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అనుకోకుండా అకౌంట్లో లక్షలు, కోట్లలో డబ్బులు పడటం, వాటిని జల్సాలకు వాడుకునే వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసే వారి కథనాలు తరచుగా టీవీల్లో, పేపర్లలో కనిపిస్తుంటాయి.
అలాంటి సంఘటనల నుంచే దర్శకుడు మారుతి నగర్ సుబ్రమణ్యం కథను రాసుకున్నాడు. ఈ సింపుల్ పాయింట్‌తో రెండున్నర గంటలు ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడం అంటే కష్టమే. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్‌హాఫ్ ఫన్…
పాతికేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సుబ్రహ్మణ్యం ఇంట్లో భార్య, అత్త చేత మాటలు పడటం, అతడి కష్టాలు, కొడుకు భ్రమలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. ఈ సీన్స్‌లోని సిట్యూవేషనల్ కామెడీ వర్కవుట్ అయ్యింది. రావురమేష్ కామెడీ టైమింగ్, పంచ్‌లు నవ్విస్తాయి. సెకండాఫ్‌లోనే దర్శకుడు అసలు కథలోకి వెళ్లాడు.
భార్య తన అకౌంట్లో డబ్బులు వేసిందని తెలియని సుబ్రహ్మణ్యం వాటిని ఖర్చుచేయడం, ఆ డబ్బును కూడబెట్టే ప్రయత్నంలో సుబ్రహ్మణ్యం అర్జున్ తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్లే సీన్స్‌తో ఫన్‌తో పాటు సస్పెన్స్ ఉండేలా రాసుకున్నాడు.
మైండ్‌బ్లోయింగ్ అనుకునేలా కాకపోయినా చిన్న చిన్న ట్విస్ట్‌లతో కొత్త పాత్రల్ని స్క్రీన్‌పై తీసుకొస్తూ సెకండాఫ్‌ను నడిపించాడు. ఈ క్రమంలో కొన్ని చోట్ల లాజికల్‌లు మిస్సయిన వాటిని కామెడీతో కవర్ చేశారు. ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేసిన విధానం బాగుంది.
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాకు కామెడీనే బలం. కానీ అదే కొన్ని చోట్ల బలహీనంగా మారింది. కామెడీ కోసమే అవసరం లేకపోయినా దర్శకుడు కొన్ని పాత్రలు క్రియేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫన్ విషయంలో ఆకట్టుకున్న దర్శకుడు కీలకమైన ఎమోషన్స్‌లో కొంత తడబాటుకు లోనయ్యాడు.