హీరోయిన్ రష్మిక మందన తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తనకు జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ గురించి రష్మిక ఈ పోస్ట్‌లో చెప్పింది. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్న ప్రమాదమేనని స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నానని, అందుకే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయానని వివరించింది.
కంగారు పడకండి
“నేను పబ్లిక్‌లో కనిపించడం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం చాలా రోజులైపోయింది. ఆగస్టు నెలలో నేను అంత యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఒక చిన్న ప్రమాదం. కానీ, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం నేను చాలా యాక్టివ్‌గా ఉన్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ఎప్పుడూ ముఖ్యం, ఎందుకంటే జీవితం చాలా చిన్నది. రేపు ఏమవుతుందో మనకు తెలియదు, అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.” అని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంది.
సరదాగా ఓ ట్విస్ట్
చివర్లో “లడ్డూలు ఎక్కువగా తింటున్నాను” అంటూ సరదాగా రష్మిక ఓ కామెంట్ కూడా చేసింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ రష్మికకు అసలు ఏమైందని ప్రశ్నిస్తూ, తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలను మాత్రం రష్మిక ఎక్కడా చెప్పలేదు.