హీరో నితిన్(Nithin), శ్రీలీల(Sreeleela) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’(Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. భీష్మ కాంబినేషన్ కావడంతో ‘రాబిన్ హుడ్’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythry Movie Makers) నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ‘రాబిన్ హుడ్’(Robinhood). డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఇదే నెలలో మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘పుష్ప-2’(Pushpa-2) విడుదల కాబోతుండటంతో వాయిదా పడుతుందని పలు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా, ‘రాబిన్ హుడ్’ మేకర్స్ దీపావళి సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేస్తూ రిలీజ్ తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ‘‘గెట్ రెడీ.. బ్లాస్ట్ చేద్దాం’’ అనే క్యాప్షన్ జత చేసి డిసెంబర్ 20న విడుదల కాబోతున్నట్లు నితిన్ పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.