బుల్లితెరపై ఎన్ని యాంకర్లు వచ్చినా, సుమ స్థానం మాత్రం సుమదే! ఆమె టీవీ షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. రాజీవ్ కనకాల కూడా పవర్‌ఫుల్ పాత్రలతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. వీరి కుమారుడు రోషన్ కూడా గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పటికే బబుల్‌గమ్ అనే సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడు.
ఫస్ట్ సినిమా:
తన తొలి సినిమానే అయినా, రోషన్ యాక్టింగ్‌లో ఎలాంటి ఆత్రం లేకుండా అద్భుతంగా నటించాడు. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. మోగ్లీ అనే టైటిల్‌తో, ఈ చిత్రానికి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రోషన్ ఈ సినిమాలో అడవిలో గుర్రం తో కనిపించాడు, టైటిల్ చూస్తే అటవీ నేపథ్యంలో ఉన్న కథ అనిపిస్తోంది. కళాభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది.
రోషన్ ను చిన్నప్పుడు:
మోగ్లీ పోస్టర్ ను యాంకర్ సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, రాజీవ్ రోషన్‌ను చిన్నప్పుడు మొగ్లీ అని పిలిచేవాడు, ఇప్పుడు అదే పేరుతో సినిమా చేయడం నిజంగా మ్యాజిక్ అని చెప్పింది.