మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియా వేదికగా పలు విషయాలపై రియాక్ట్ అవుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఇటీవల భారీ వర్షాల కారణం వరదలతో ఇబ్బంది పడిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను ఆదుకునేందుకు సాయి ధరమ్ తేజ్ రూ. 20 లక్షలు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, విజయవాడలోని అమ్మ అనాథాశ్రమానికి రూ. 2 లక్షలు ఇతర సేవా సంస్థలకు రూ. 3 లక్షల విరాళం అందించాడు.
సెప్టెంబర్ 11న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న వారితో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ చెక్ అందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సాయి ధరమ్ తేజ్ మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచే సాయం చేసే గుణం వచ్చిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, 2019లో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అనాథ ఆశ్రమానికి రెండేళ్లలో బిల్డింగ్ కట్టి ఇచ్చారు. అంతేకాకుండా సాయం కోరిన వారికి తనవంతుగా ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఆదుకుంటున్నాడు.