సాయి పల్లవి (Sai Pallavi )..ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సహజ నటి. సాయి పల్లవి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే..అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే డ్యాన్సింగ్ క్వీన్. యాక్టింగ్లో తనకుంటూ ఓ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకుని..సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా దూసుకెళ్తోంది.
ఇదిలా ఉంచితే..ప్రస్తుతం సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. గత కొన్ని నెలల క్రితం (జనవరి 21న) సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ (Pooja Kannan)తన బాయ్ ఫ్రెండ్ వినీత్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది,
ఇవాళ గురువారం (సెప్టెంబర్ 5న) పూజా కన్నన్ (Pooja Kannan) వివాహ వేడుకగా ఘనంగా జరిగింది. తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్‌తో పూజ ఏడడుగులు వేశారు. సాయి పల్లవి దగ్గరుండి తన చెల్లెలు పెళ్లిని నిర్వహించింది. ఈ వేడుకల్లో సాయిపల్లవి సందడి చేశారు. ఈ వివాహం కోటగిరిలో పడుకర్ కుల పద్ధతిలో జరిగింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సోదరితో కలిసి సాయి పల్లవి డ్యాన్స్ చేశారు. ఈ ఫొటోస్లో హీరోయిన్ సాయి పల్లవి చిరునవ్వుతో మెరిసిపోతుంది.
Sai Pallavi in Badaga Traditional for her Sister’s wedding
ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే సాయి పల్లవి డ్యాన్స్‌కు మరోసారి ఫిదా అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఓ వర్గం ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదేనండీ..ఇప్పుడు సాయి పల్లవి చెల్లెది మ్యారేజ్ అయిపోయింది కదా..ఇక సాయి పల్లవి కూడా త్వరలో మ్యారేజ్ చేసుకోక తప్పదు కదా..అని కామెంట్స్ పెడుతున్నారు.
పూజా కన్నన్ తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’ అనే మూవీలో నటించింది. ఆ సినిమాలో సముద్రఖణి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత పూజాకి మరో సినిమాలో నటించే అవకాశం రాలేదు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సాయి పల్లవికి పర్సనల్ మేనేజర్‌గా ఉంటూ..షూటింగ్‌లు, ప్రమోషన్స్ చూసుకుంటోంది.