గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తోన్న పొలిటికల్ యాక్షన్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రా మచ్చా మచ్చా అంటూ సాగే పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించారు.
అయితే ఈ సాంగ్ చూసిన హీరోయిన్ సమంత.. చెర్రీ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. ఈ సాంగ్ వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన సామ్ నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు అంటూ.. అన్‌మ్యాచబుల్ అంటూ కామెంట్ చేసింది. అంతే కాకుండా ఇదే పోస్ట్‌కు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా రిప్లై ఇచ్చింది. మిస్టర్ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్ పుట్టించారని కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా.. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా డిసెంబర్‌లో క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, నవీన్‌చంద్ర, అంజలి, ప్రకాశ్‌రాజ్ కీలక ప్రాతల్లో నటిస్తున్నారు.