మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులతో సహా అందరూ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ నటడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే.. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్నీ భాషల్లో కలిపి మిలియన్స్ వ్యూస్‌తో ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌తో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ, మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఇందులో.. ‘దేవర’ ముచ్చట్లు పంచుకున్నారు చిత్ర బృందం. ఈ ప్రోమోలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘దేవర’ రన్ టైమ్ ఎంత సార్ అని మూవీ టీమ్‌ను ప్రశ్నిస్తాడు. దీంతో డైరెక్టర్ కొరటాల శివ షాక్ అయ్యి.. మీరు రన్ టైమ్ అడుగున్నారా అంటాడు. అలాగే ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. ‘మీ యానిమల్ సినిమా రన్ టైం ఎంత అని సందీప్‌ను ప్రశ్నిస్తాడు’. 3:24 గంటలు అని బదులిచ్చాడు సందీప్. దీంతో అన్ని గంటల రన్ టైమ్ సినిమా తీసిన నువ్వే.. మా సినిమా రన్ టైమ్ అడుగున్నారా అంటూ ఎన్టీఆర్ చమత్కారంగా స్పందిస్తాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఈ పూర్తి ఇంటర్వ్యూ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు మేకర్స్.