సినిమా రివ్యూ: ‘సత్యం సుందరం’ (Satyam Sundaram)
విడుదల తేది: 28–9–2024
నటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, శ్రీదివ్య, దేవ దర్శిని, రాజ్‌కిరణ్; స్వాతి కొండె, జయప్రకాశ్, శ్రీరంజని తదితరులు.
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
ఎడిటింగ్: ఆర్.గోవిందరాజ్
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాతలు: జ్యోతిక – సూర్య
తెలుగు విడుదల: సురేష్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: సి.ప్రేమ్‌కుమార్ (C Prem Kumar)
హీరో కార్తీ, అరవింద్ స్వామి ముఖ్యపాత్రల్లో ది గ్రేట్ డైరెక్టర్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సత్యం సుందరం”. ఇది ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి లవ్ స్టోరీగా ఎంతోమందిని ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ చిత్రాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవకుండా ఉండలేరు. ఈ సినిమాని హీరో సూర్య మరియు హీరోయిన్ జ్యోతిక దంపతులు నిర్మించారు. సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం, పాజిటివ్ టాక్ తో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ సినిమాకి కథేమిటి? మరి పూర్తి వివరాలు చూద్దాం..
స్టోరీ:
పల్లెటూరి నుంచి సిటీకి వెళ్లిన ఒక కుటుంబం తన సొంత ఊరిలో మోసపోయిన విధానంపై ఈ సినిమా నడుస్తుంది. ఇందులో సత్యమూర్తి అలియాస్ సత్యం పాత్రలో అరవింద్ స్వామి కనిపిస్తారు. సత్యం గుంటూరు దగ్గర ఉన్న ఉద్దండరాయిని పాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి తన సొంత ఊరు, తాతల కాలం నాటి ఇళ్లు అన్నా ఎంతో ఇష్టం. కానీ, అతని చిన్నతనంలోనే బంధువులు అతడిని మోసం చేసి ఆ ఇల్లును లాక్కుంటారు. దీంతో, సత్యం కుటుంబం ఆ ఊరును వదిలి వైజాగ్‌కు వెళ్లిపోతుంది.
సత్యం ఊరును వదిలి 30 సంవత్సరాలు గడిచిపోయాక, ఒకరోజు తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం తిరిగి ఊరికి వస్తాడు. ఈ సమయంలో అతని బంధువులు అందరూ కలుస్తారు. ఇందులో సత్యం దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి బావ బావ అంటూ పిలుస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, హీరో కార్తీ. చాలా ఏళ్ల తర్వాత సత్యం ఊరికి వచ్చాడని, కార్తీని గుర్తుపట్టలేకపోతాడు. కార్తీ మాత్రం సత్యంతో ఎంతో ఆప్యాయంగా కలుస్తూ బావ అని పిలుస్తూ, ఇద్దరి మధ్య మంచి బాండింగ్ పెరుగుతుంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి, సత్యం ఎందుకు కార్తీని గుర్తుపట్టలేదు అనేది కథలోని ఆసక్తికరమైన అంశం.
ఎలా ఉందంటే:
ఈ సినిమా చూస్తుంటే ఏదో పుస్తకం లోని కథ చదివినట్టు ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. చాలా మంది పల్లెటూరు వదిలి సిటీలో స్థిరపడిన వారు ఈ సినిమా చూస్తే వెంటనే వారి పూర్వికుల ఊరికి వెళ్ళాలనే ఆలోచన కలుగుతుంది. డైరెక్టర్ అన్ని హంగులతో అద్భుతంగా ఈ కథను తెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమా మనం మన ఊరిని, బంధువులను గుర్తు చేసుకునేలా చేస్తుంది. సినిమాలోని హాస్యం మధ్య మధ్యలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్ లో కార్తీ, సత్యం మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అందరినీ కట్టిపడేస్తుంది.
నటీనటుల పనితీరు:
అరవింద్ స్వామి, కార్తీ వారి పాత్రల్లో జీవించారని చెప్పవచ్చు. నటన విషయంలో ఇద్దరూ ఎంతో బాగా ప్రదర్శించారు. సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాలో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్నీ హంగులు సమతుల్యంగా ఉన్నాయని తెలుస్తోంది.
ఫైనల్ రిజల్ట్:
ఫ్యామిలీతో కలిసి తప్పక చూడవలసిన ఒక అద్భుతమైన చిత్రం.