కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘నా అనారోగ్య సమస్య గురించి ఫస్ట్ టైమ్ తెలుసుకుని నేను చాలా భయపడ్డాను.
అభిమానులు(fans), ప్రజలు కలవరపడటం నాకు ఇష్టం లేదు అందుకే ఈ విషయం బయట పడకుండా జాగ్రత్త పడ్డాను. దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మ విశ్వాసాన్ని పొందాను. ఇప్పుడంతా బాగానే ఉంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను అబద్ధం చెప్పట్లేను బాగున్నాను. నేను కూడా మనిషినే కదా నాకు సమస్యలు వస్తుంటాయి.
నాకు వచ్చిన అనారోగ్యానికి సమస్యకు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు సెషన్ల ట్రీట్‌మెంట్(treatment) పూర్తయింది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రజెంట్ శివరాజ్ కుమార్ ‘భైరవి రంగల్’(Bhairavi Rangal) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ నవంబర్ 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.