శోభిత ధూళిపాళ్ల నటించిన ‘లవ్, సితార’ చిత్రం: ఓటీటీలో రిలీజ్
అక్కినేని హీరో నాగచైతన్యతో ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా చిత్రం ‘లవ్, సితార’. ఈ సినిమాను వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇది ఒక ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడింది. అయితే, ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ నెల 27 నుండి జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రత్యేక పోస్టర్‌తో పంచుకున్నారు.
చైతూతో ఎంగేజ్‌మెంట్
టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్‌లో వెల్లడించారు.