తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ కథానాయికలలో ఒకరైన శ్రీలీల, ప్రస్తుతం కాస్త విశ్రాంతి మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి నటించిన “పెళ్లిసందడి” చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీల, ఆ తరువాత వరుస ఆఫర్స్‌తో బిజీ హీరోయిన్‌గా మారింది. ఆమె చేసిన సినిమాలు సక్సెస్ లేదా ఫెయిల్యూర్ సంబంధం లేకుండా, హవా కొనసాగించేది. అయితే, ప్రస్తుతం ఈ హవా తగ్గిందని సినీ వర్గాలు అంటున్నాయి.
“గుంటూరు కారం”లో మహేష్‌బాబుతో నటించిన ఆమె, ప్రస్తుతం నితిన్‌తో “రోబిన్‌హుడ్” చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ సగం వరకు పూర్తయింది. రవితేజ కొత్త సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది, కానీ రవితేజ శస్త్రచికిత్స కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
ఈ షూటింగ్‌లకు గ్యాప్ రావడంతో శ్రీలీల కాస్త హాలీడేలు ఎంజాయ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. “ధమాకా” మినహా, ప్రస్తుతం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం వలన ఆమెకు కొత్త ఆఫర్స్ తగ్గాయని వర్గాలు అంటున్నాయి.