సుహాస్ చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి, ఇప్పుడు హీరోగా విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. సుహాస్ అంటే ఒక గ్యారెంటీ అనిపించే స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు సుహాస్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఏర్పడుతుంది. సుహాస్ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న స్థాయికి చేరుకోవడం ఒక సాధారణ విషయం కాదు.
ఇప్పుడతనికి మరో కొత్త అడుగు వేయడానికి అవకాశం వచ్చింది. ‘జనక అయితే గనక’ అనే సినిమాతో సుహాస్ డిస్ట్రిబ్యూటర్‌గా మారిపోయాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మించింది, సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం నాడు సుహాస్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా దిల్ రాజు ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ చిత్రానికి ఓవర్సీస్ రైట్స్‌ను సుహాస్ స్వయంగా కొనుగోలు చేసినట్లు చెప్పారు.
దర్శకుడు తరపున ఓ ప్రపోజల్ వచ్చినప్పుడు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికిస్తారనే ప్రశ్నకు, దిల్ రాజు రెగ్యులర్‌గా ఇచ్చే వారికి ఇస్తానని చెప్పాడు. కానీ ఓ కొత్త డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడని, అతనికి ఇవ్వొచ్చా అని అడిగారు. దిల్ రాజు ఆలోచించి, ఆ మార్కెట్ రేంజ్ చూసి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు.
ఆ కొత్త డిస్ట్రిబ్యూటర్ ఎవరా అని దిల్ రాజు అడగగా, చివరకు సుహాస్ ముందుకు వచ్చాడు. సుహాస్ చేతికి యూఎస్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వెళ్లిందని వెల్లడించారు. దీనిపై దిల్ రాజు, నేరుగా అడగకుండా వాళ్లతో ఎందుకు అడిగించావ్ అని సుహాస్‌ను స్టేజ్ మీదే ప్రశ్నించాడు. సుహాస్ కాస్త భయం వేసింది సర్ అని జవాబిచ్చాడు. దిల్ రాజు నవ్వుతూ, “భయం ఎందుకు? డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నావ్ కదా?” అని సుహాస్‌ను ప్రోత్సహించాడు.