పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చాడు.
దీంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ పవన్ సినిమా షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటారా? అప్డేట్స్ ఎప్పుడొస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలు వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ అధికారిక ప్రకటన విడుదల కాలేదు. తాజాగా, హరిహర వీరమల్లు నుంచి సూప్ అప్‌డేట్ విడుదల చేశారు మేకర్స్. ‘‘సెప్టెంబర్ 23న భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నాము. హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో చిత్రకరించనున్నాం. ఇందులో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.