శ్రీకాళహస్తి శివయ్య ఆలయంలో.. కుటుంబ సమేతంగా రాహు కేతు పూలు చేశారు కేంద్ర మంత్రి, హీరో సురేష్ గోపి. 2024, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన.. అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం.. పూజారి సమక్షంలో రాహుకేతు పూజ చేశారాయన. 30 నిమిషాలు ఈ పూజ సాగింది.
ఈ సందర్భంగా సురేష్ గోపి మాట్లాడుతూ నెక్స్ట్ జనరేషన్ అవసరాలు కనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.
అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతేగాకుండా ప్రసాద్, అమృత పథకాలు కింద చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రదేశాలైన శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందేందుకు నిర్మాణాత్మక సహకారం అందిస్తామన్నారు.