యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమా ‘క’. పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా సుజీత్, సందీప్ టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్లుగా పరిచయమవుతున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకంగా రూ. 20 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం.
‘క’ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే.. ఇటీవల నయన్ సారిక పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యగా.. తాజాగా తన్వీ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తన్వీ ట్రెడిషినల్ లుక్‌లో దాండియా ఆడుతూ మరింత అందంగా, ఆకర్షనీయంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుటోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ‘క’ చిత్రం త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.